30, జులై 2011, శనివారం

ఆటవెలది ప్రభావము

ఫొటో సౌజన్యము - మాల్గుడి డేస్















                                                                                       అధ్యాపకుల ఆటవెలది పద్యం ఒక బాలుని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, భవిష్యత్తులో అతడు గొప్ప వ్యక్తిగా మారడానికి కారణమైంది.
20వ శతాబ్దం ఆధునికతను సంతరించుకుంటూన్న రోజులవి. చేతులకు మురుగులు, చెవులకు పోగులు, గిరిజాల జుట్టు –ఈ తరహా అప్పటి వేషధారణతో  పిల్లవాడైన తాపీ ధర్మారావు స్కూల్లో ప్రవేశించాడు.క్లాసు పాఠాలకు సంబంధించి,కొన్ని ప్రశ్నలు వేశారు టీచర్.ఆ ప్రశ్నలకు జవాబు తెలియక,బాలుడు ఐన తాపీ ధర్మారావు తెల్ల మొహం వేయాల్సి వచ్చింది.అప్పుడు మాష్టారు నోటి వెంట వచ్చిన సమాధాన పూర్వక ప్రశ్నా పద్యం చెప్పారు...“మురుగులుంగరములు, ముత్యంపు సరులు;పురుషుని గైసేయు భూషణములె?అర నిమేషమునకు అన్నియు నశియించు.విద్య యొక్కటె యెపుడు విడని తొడవు!”చదువరులు సులభంగానే ఊహించి ఉంటారు.“నన్ను ఎద్దేవా చేయడానికే ఈ ఆటవెలదిని ఆడించారు” అని అనిపించింది ఈ కొత్త విద్యార్ధికి.అంతే! ఇల్లు చేరగనే, గమ్మున కర్ణాభరణాలనూ,కర కంకణాది ఆభరణాలనూ తీసేసారు.ఇతః పూర్వమే నానుడిగాప్రసిద్ధికెక్కిన పద్యములోని నాలుగో పంక్తినితన తండ్రి కూడా  మందలిస్తూ చెప్పాడు కూడా!ఈ చిన్ని పరిహాసం,తాపీ ధర్మారావుని విద్యాసాధన పట్ల దృఢచిత్తునిగా మార్చి,సమున్నత వ్యక్తిగా నిలబడడానికి హేతువైనది.“ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే!చదువులో ప్రథమ స్థానంలో నిలబడాలి ”  అని అనుకున్నఆ నాటి బాలుడైన తాపీ ధర్మారావు.క్రమంగా సాహిత్యాన్ని సంఘసంస్కరణలకు ఆలంబనముగా మార్చి,అత్యున్నత గౌరవ యశస్సులను ఆర్జించగలిగిన మేధావి అయ్యాడు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&          

తాపీ ధర్మారావు (Web patrika)  (Link 1)
                    ఆ బిరుదు తాపీదే! 6 జూన్ 2011   (Link 2)





25, జులై 2011, సోమవారం

చార్లీ చాప్లిన్ ఏ భాషలో మాట్లాడాడు?











  “చార్లీ చాప్లిన్”  “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా, 
విజయదుందుభి మోగించే  ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”.
ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ 
సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది. 
ఈ English Movie  ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన మహా నటుడు 
“ఛార్లీ చాప్లిన్” కీర్తి కిరీటంలోని కలికితురాయి.
ఈ చిత్ర కథ, చాప్లిన్ ఫ్యాన్స్ కి అందరికీ తెలుసు.
జర్మనీ దేశాన్ని, జర్మని జాతి వారు – 
ఆర్య వారసత్వ మూలములు 'తమ కలిమి గా 'కలిగిన వారని , 
త్రికర్మణా నమ్మాడు హిట్లర్. 
తన మూఢ విశ్వాసాలను అత్యంత క్రూరంగా 
అత్యంత హేయంగా యావత్ ప్రపంచము నెత్తిన రుద్దాలని యత్నించిన 
నియంత హిట్లర్ పోకడలకు వ్యంగ్య రూపకమే 
1940 సంవత్సరము నాటి "The Great Dictator". 
మూవీ రూప కల్పనకి నాంది అనుకోకుండా పలికిన సందర్భం వింత ఐనదే!
Alexander Kord అనే స్నేహితుడు,
“నీ ముఖంలోని ముక్కట్లు  (= పోలికలు)”
కొన్ని యాంగిల్సులో హిట్లర్ లాగా ఉన్నాయి.” అన్నాడు.
మిత్రుని మాటలతో – ఛార్లీ అద్దంలో తన బింబాన్ని పరిశీలించుకునాడు.
ఫొటోలలో తన Face ను, పోలికలనూ పరిశీలనగా మళ్ళీ మళ్ళీ గమనించుకున్నాడు. 
Alexander Korda,వాక్కులు  ఆతని అద్భుత చిత్రానికి చిత్రంగా ముహూర్తం ఐనది.
హిట్లర్ ఆశయాల ఆచరణలో కూరిన అసంబద్ధత- ఆతని మూర్ఖత్వమూ – 
ఛాప్లిన్ యొక్క ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయిగా నిలిచేలాగా – 
‘న భూతో, న భవిష్యతి ’ అన్న చందంగా ఛాప్లిన్ చేతిలో రూపొందినది.
మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే – ఒకటేమిటి? 
అన్ని కోణాలలోనూ సర్వతోముఖంగా – నిర్మించబడినది.
ప్రపంచ దేశాల బొమ్మను వేసిన గాలి బుడగ – సన్నివేశం 
ఛార్లీ చాప్లిన్ కళాభినివేశానికి ప్రతిరూపం, 
సినీ చరిత్రలో శిఖరాగ్ర స్థాయిలో సుస్థిరమైన చిత్రీకరణ అది.
బుడగను బ్యాలెన్స్ చేస్తూ ఆడిన నియంత ఆట – నాట్యంగా 
ప్రేక్షకుని కంటికి ద్యోతకమయ్యే రీతిగా ఆ అమోఘ దృశ్యము ..........
ఆహా!   
ఆ మహా నటుడు ప్రశంసా వర్షంలోనిలువెల్లా తడియడంలో ఆశ్చర్యం ఏమున్నది?
“The Dictator” లో మహా నియంత, 
అశేష జర్మనీ ప్రజానీకాన్ని మేధో విమూఢ చిత్తులనుగా చేసేసి , 
వారిని విపరీతమైన హింసా దౌర్జన్యాల చర్యలకు పురికొల్పిన పద బంధాలు అవి.
ఆ ప్రజలు నిర్హేతుకంగా, నిర్దయా హృదయులై 
తమ ప్రవర్తనతో సకల మానవాళినీ పెను ముప్పులోకి నెట్టివేసిన దుష్ట లగ్నము అది. 
అంత ప్ర భావవంతమైనది హిట్లర్ ప్రసంగం. 
సరే! ఇప్పుడీ అప్రస్తుత ప్రసంగం ఎందుకని చదువరుల సందేహం? ఔనా?
సినీ సమీక్షా వర్గాలకు – ప్రత్యేకించి-  సినిమాలోని - హిట్లర్ స్పీచ్  
ఆసక్తి గొలిపే అంశంగా పరిణమించినది.
 చార్లీ చాప్లిన్ – హిట్లర్ వేష ధారణతో – మైకు ఎదుట నిల్చుని, 
అనర్గళంగా మాట్లాడాడు, 
"అప్పుడు చార్లీ చాప్లిన్ ఉరఫ్ Adolf Hitler -
తన డైలాగులను ఏ లాంగ్వేజీ లో మాట్లాడాడు? "
ఇదీ ఆ ప్రశ్న.
ఆ shot లో చాప్లిన్ - Esperanto Language ని 
ఉపకరణంగా మలుచుకున్నాడు – అని 
సినీ వర్గాల భావన.
ఎస్పిరాంటో భాష అంటే ఏమిటి? 
Esperanto language ఏ కంట్రీ citizens వ్యావహారికంలో ఉన్నది?
 Dr L.L. ZamenhOf  అనే యూదు వ్యక్తి ఈ భాషకు బీజావాపనం చేసాడు.
Dr. Lazarus Ludwig  Zamenhof పోలండ్ యూదుడు(a Polish physician )  
(15 Dec 1859 to 14 Apr 1917) 
"ప్రపంచ భాష "అనే యోచనతో , సార్వ జనీన భాషకు శ్రీకారం చుట్టాడు. 
హిందు దేశములో - ప్రాచిన కాలములో 
సకల భారతీయ భాషలను అనుసంధానించిన ప్రయోగమే - సంస్కృత భాష.
మన దేశములో గీర్వాణ భాష ఆవిర్భావ భావన వంటిదే 
ఇలాగ ఈ Esperanto language. 
1887 లో “ Unua Libro”అనే పుస్తకము ఈ విషయ సంబంధిగా 
ముద్రితమైన మొదటి పుస్తకమని పేర్కొనవచ్చును.

ఎస్పిరాంటో – భాషను మాట్లాడే అభిలాష ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా – 
ఒక లక్ష నుండి పది లక్షల మంది దాకా ఉన్నారని అంచనా.
కొన్ని సినిమాలు కూడా Esperanto భాషలో నిర్మించబడినాయి కూడా!


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


esperanto language,Dr L.L. ZamenhOf 


కలికితురాయి  (Link 1)



చార్లీ చాప్లిన్ letter  (Link 2)








  

18, జులై 2011, సోమవారం

కేక పెడితే కీర్తన















"మహతి" మీటిన క్రిష్ణశాస్త్రి ; 
కవితా గగనములో  భావకవిత్వ చంద్రికలను 
ఆరబోసినది దేవులపల్లి క్రిష్ణశాస్త్రి క్రిష్ణపక్షము .
ఈ క్రిష్ణ పక్షము- రాయక మునుపే, 
ఈ పొత్తము ప్రచురణకు రాక మునుపే- 
ఆయన – బ్రహ్మసమాజము వారు కోరగా- 
ప్రార్థనాగీతములను రచించినారు. 
అలాటి పాటలను కూర్చిన కూడలి-
“మహతి” అనే కవితాసంపుటి.
దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గేయ సంపుటి- “మహతి” - 
ఇందులో 67 పాటలు, 12 పద్యాలు ఉన్నవి..
“మహతి” సంపుటిలో అద్భుత దేశభక్తి గీతం ఉన్నది- 
అదే – 
“జయ జయ జయ! ప్రియభారత జనయిత్రీ! దివ్యధాత్రి!.......”
మహతి-లో మరొక దేశభక్తి గీతము ఇలాంటిదే ఉన్నది.


“తెలుగుతల్లికి మంగళం ; 
మా, కల్పవల్లికి మంగళం; 
కొలుచు మా ఎద, నిలుచు ; 
మా, రాజ్ఞి!`నీమ తల్లికి మంగళం! 
ప్రాతక్రొత్తల కౌగిలింతల; 
ప్రసవమ్మగు బంగారు కాంతుల; 
భావికాల స్వర్గమరుచు; 
ప్రౌఢప్రతిభకు మంగళం!; 
నాగరికతకు వలచి వచ్చిన; 
నాడు నాడులు  తరలి వచ్చిన; 
భోగభాగ్యములందజూపే; 
రాగరహితకు మంగళం!; 
వేదవేదములన్ని తరచీ, 
వాదభేదములన్ని మరచీ; 
స్వామ్య ధర్మ పథమ్ము; పరచు 
వి-శాల శీలకు మంగళం!; 
నాకమందిన పగటివేళ; 
నరకమందిన కారురేల; 
ఏకగతి “తెలుగమ్మ “ నడిపిన: 
ఏకయంతకు(?)మంగళం! 
తెలుగుతల్లికి మంగళం! 
మా కల్పవల్లికి మంగళం.”


మహతి-లోని గీతాలు అన్నీ 
సాహిత్యసీమలలో ప్రచారం పొందినవి.
బ్రహ్మసమాజము ప్రార్థనా సమావేశాలలో 
మారుమ్రోగేవి కొన్ని పాటలు.


“శిథిలాలయమ్ములో శివుడు లేడోయీ; 
ప్రాంగణమ్మున గంట మ్రోగలేదోయీ!....” 


వానిలో ఒకటి.
ఆ పాట నాకు (ఈ వ్యాస రచయిత్రికి) చాలా ఇష్టం.


దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి రచనలు రాశిలో,
పరిమాణములో  తక్కువ. 
“ పుంఖాను పుంఖాలుగా రాయకుండా, తక్కువగా రచించారు ” అంటూ 
ఆయన మీద విమర్శ ఉన్నది.
“అమరుక కవేః ఏకం శ్లోకః ప్రబంధం శతాయతేః ” అని కదా 
సహృదయుల అభిమాన లోకోక్తి!!!!


“ నేనేదో భక్త కవినీ కాను; మీరనుకున్నంత భక్తుణ్ణీ కాను. 
కొందరు అనుకునేటంత దుర్మార్గుణ్ణీ కాదు. 
ఎప్పుడో హృదయావేదన భరించ లేనప్పుడు కేక పెడతాను. 
అది కీర్తన ఔతుంది.” 
సాధారణంగా భావ తాదాత్మ్య కవులందరికీ 
ఈ పలుకులు వర్తిస్తాయి కూడా!
“మీది ఏ కులము?”
ఆ భావ కవీంద్రుని జవాబు 
“మాది కవి కులము ”
1942 నుంచీ చెన్న పురికి నివాసం మార్చుకుని, 
తన గీతాలతో 
“మల్లీశ్వరి” ఆదిగా 
ఆంధ్ర సినీ రంగాన్నికూడా పరిపూర్ణం చేసింది 
ఆయన కలము.
అందుకే తిరుమల రామచంద్ర 
“ నవ్య కవితా ప్రస్థానాచార్యులు ” అని 
గౌరవ పురస్కరంగా పేర్కొనారు.    


      konamanini   ( బుధవారం 11 ఆగస్టు 2010 - Link 1)



15, జులై 2011, శుక్రవారం

నాకు మాత్రం గుర్తుకు వచ్చారు
























;
;
;

                                                                                                

            ఆషాడమాసములోని పూర్ణిమ విశిష్టమైనది.  
భారతదేశంలో గురుపూర్ణిమ విశిష్టమైన పర్వదినము.వ్యాసపూర్ణిమ/  వేద వ్యాస పూర్ణిమగా గురు శిష్య సంబంధాల ఔన్నత్యానికి మంచి గురుతుగా ఈ పండుగ వేడుకలు జరుగుతూంటాయి.                                                                                                                            
నాకు మాత్రం - the wonder kid, running boy బుధియాసింగ్, 
ఆ  పిల్లవాని coach  బిరించిదాస్ గుర్తుకు వచ్చారు. విద్యార్ధులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా శక్తులను గుర్తించి, సరైన సమయంలో- సానబట్టి వజ్రంలాగా తీర్చిదిద్దగలిగే వాడే నిజమైన గురువు. అలాంటి ఉపాధ్యాయుడు బిరించిదాస్. బుధియా, బిరించి లు "కనుగవ"వలె సమకూరిన మంచి సందర్భం ఒరిస్సాలో సమకూడినది. బిరించిదాస్ మాత్రం చిత్రంగా అనేక విమర్శలను ఫేస్ చేయాల్సివచ్చింది.ఆ  క్రీడా గురువు- ఎన్నో సమస్యలతో ఎదురీతగా ముందుకు సాగవలసి వచ్చినది కదా! ఇదే విధి వైపరీత్యం అంటే! అంతే కాదు, ఆ తర్వాత విధి వక్రించింది. కొందరు దుష్టుల చేతిలో మడిసిపోయాడు. రాజా ఆచార్య, కొందరు దుండగులు బిరించి దాస్ ను నిర్దాక్షిణ్యంగా హత్య చేసారు.విధి వక్రించడమంటే ఇదే!(“ప్రేమ దేశం”సినిమాలో (అన్నట్లుగా నాకు జ్ఞాపకం!!) – ఒక మార్షల్ అపోర్ట్శ్ మాస్టర్ ని, విలన్లు సల సలా కాగే నీళ్ళలో కాళ్ళు పెట్టించి, హింసించే దృశ్యాన్ని ఒళ్ళు గగుర్పొడిచేలాగా చిత్రీకరించారు దర్శకులు,ఈ సంఘటన స్ఫూర్తి అయిఉండాలి)మరి "కళింగ హాస్టల్"లోనూ, క్రీడా అధ్యాపకుల వద్ద బుధియా పొందుతూన్న "శిక్షణ"ఏ స్థాయిలో ఉంటూన్నదో?బిరించిదాస్ స్టాండర్డ్ లో ఆ బాలునికి ట్రైనింగ్ ఇస్తూన్నారా?                                                                                                                                        (బి.బి.సి. ఆదిగా గల టి.వి.ఛానల్స్ -  What happened to Budhia Singh, India's marathon boy? -  వంటి  కొన్ని ప్రోగ్రాములను ప్రసారం చేసాయి కూడా! )                        మళ్ళీ ఏ ఆసియా క్రీడలలోనో, ఒలింపిక్స్ స్పోర్ట్స్ లోనో బుధియా, మన India తరఫున విజయ కేతనాన్ని ఎగురవేస్తాడని, ఆశిస్తూ,బిరించిదాస్ కు బాష్పాంజలి. 
         Tags: By the age of four, Budhia Singh had run 48 marathons
         
            BirinchiDas  (Link 1)   


            Budhia Singh (Link 2)





13, జులై 2011, బుధవారం

ఆభరణ వడియాలు(బొరీలు)

                    

ఉత్తర భారత దేశంలో వడియాలను నక్షత్ర బొరీ/ గైనా బొరీలు మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.
బెంగాల్ రాష్ట్రములో ” ఆభరణ వడియాలు తయారీ”చాలా ప్రసిద్ధి చెందింది.ఈ వడియాలు,
జిలేబీల తయారీతో పోల్చ వచ్చును.
అక్కడి వనితామణుల హస్త నైపుణ్యానికి నిదర్శనాలు. 
నంది గ్రామ్, తాముల్క్, దిసరి, మహిషా దల్, మైనా ఇత్యాది పల్లెటూళ్ళ మహిళలు,
ప్రజలు ఇలాంటి “నగల వడియాలు” పెట్టడంలో నిష్ణాతులు.
స్థానికంగా ఈ కళా వడియాలను -
నక్షత్ర బొరీ/ గైనా బొరీలు (Gayna Bori అనీ, Naksha bori)  అని కూడా పిలుస్తారు.
వీటినే  లెంటిల్ చంక్స్(Lentil chunks)  అని కూడా వ్యవహరిస్తారు.
1954 సంవత్సరములనుండీ, అనేక ఏళ్ళుగా –
ఈ వడియాలు – బెంగాల్ లోని కొన్ని జిల్లాల జనానీకానికి ఉపాధి మార్గంగా ఏర్పడింది.
ఎంతోమందికి కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిన ఈ “ఆర్నమెంట్ వడియాలు” , వందలాది కుటుంబాలకు , ఆర్ధిక పరంగా –
చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు వలె – చేయూతను ఇచ్చినది.
వడియాలు, అప్పడాల పని స్త్రీలు చేసేదే! అనే సామాజిక అభిప్రాయాలు ఉన్నాయి.
అందుచేతనే, పురుషులలో తక్కువమంది – దేవ వ్రత బాబు లాంటి వారు ఈ పనికి మొగ్గు చూపుతున్నారు.
తాముల్క్ దగ్గరలోని – సారంగపూర్ గ్రామానికి చెందిన స్త్రీలు  మీరా , మైతీ మున్నగు అతివలు రంగవల్లికలతో – సరి
సమానంగా ఈ వడియాల సృజనను – కళ గా గౌరవిస్తూ, అభివృద్ధి చేసారు.
మనుమరాలు సేనా మైతీ, మీరా సమీప బంధువు హిరణ్మయీ దేవి, పెద్ద “Naksha bori” వడియాన్ని తయారు
చేసారు.
కళ్యాణి – అనే ఊరు వద్ద 59 వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ మీటింగులు జరిగాయి.
ఆ సందర్భంలో – హిరణ్మయీ దేవి తయారు చేసిన వడియాలను ‘సేనా మైతీ’ ఉత్సాహంతో ప్రదర్శనలో ఉంచింది.
ఆ సభకి  మహా కవి, గీతాంజలి కావ్య కర్త, నోబుల్ ప్రైజ్ గ్రహీత ఐన “రవీంద్ర నాథ టాగూర్” వచ్చారు.
ఆమె  Gayna Bori/Naksha bori ని గురు దేవులు రబీంద్ర నాథ్ టాగోర్ కు ఆప్యాయతతో,
వినయ పూర్వకంగా బహూకరించింది.
ఆ కానుకను  సంతోషంతో, ఆ సున్నిత కళా రూపాన్ని, ప్రశంసా పూర్వకంగా స్వీకరించారు.
వీటిని  చేసే పద్ధతి :
మన దక్షిణ భారత దేశంలో మినప పప్పునూ, సగ్గు బియ్యాన్నీ అధికంగా వడియాల తయారీలో వినియోగిస్తున్నారు)
(అంటే వీటిలో జిగురు శాతం ఎక్కువ కాబట్టి, ఈ పప్పుదినుసులను ఎక్కువగా వాడుతారు.
ఏడాదికి సరిపడేటన్ని రెడీ చేసుకుంటారు.
నాణ్యతా పరంగా నేతి మినుములు,బిరికలాయ్ పప్పు, లెంటిల్ పప్పులు  ఎన్నికైనవి.
లెంటిల్స్(Lentils)  పప్పు వీనికి శ్రేష్ఠము. బిరికలాయ్ పప్పుతో సిద్ధమౌతూన్న బొరీలు, రుచికరంగా ఉంటాయి.
వీటిని నీళ్ళలో నానబెట్టాలి. గరిట జారుగా రుబ్బి , ఉంచాలి.
ఇతర రకాల మినప పప్పుతో కూడా బొరీలను చేయొచ్చు.
రక రకాల మసాళాలను మిళాయించి చేస్తూంటారు.
బోరీ లను కొన్ని ఋతువులలోనే చేసే వీలు ఉన్నది. ఇవి   ప్రత్యేక వాతావరణం లోనే చెయ్యాలి, ఆయా ప్రత్యేకఋతువులలోనూ చేయాలి.
శీతా కాలము మాత్రమే వీని తయారీకి అనువు ఐనది.
సాధారణంగా  కార్తీక మాసంలో మొదలై, మార్గశిర మాసం కొస దాకా ఈ బొరీల పని, బృహత్తర కార్యక్రమంగా కొనసాగుతుంది.
వడియాలు పిండిని వండి, రెడీ చేయటం,పెట్టడం  కన్నా ఆ వడియాలను ఎండబెట్టడమే క్లిష్టతరమైన పని:—–
@) మొదటి అర్ధ గంట సేపు మంచి ఎండలో ఎండబెట్టాలి.
అటు తర్వాత – నీడలో ఆరనివ్వాలి.
@) ఏ మాత్రం గాలి తాకినా, విడిలిపోయే ఛాన్సు ఎక్కువ.
బాగా ఆరిన బొరీలను నిల్వ చేసుకోవాలి.
@) అప్పుడప్పుడూ,పాత్రలలో జాగ్రత్త పరిచిన బొరీలను,బయటకు తీసి, ఎండలో ఆరనిచ్చి,
మరల నిల్వ పాత్రలలోనికి తీసి పెడతారు.మట్టి పాత్రలలో స్టోర్ చేస్తారు.
పెట్టెలలో, బాక్సులలో ఐతే , వానిలో కాగితాల ముక్కలను వేసి, అందులో బొరీలను భద్రపరుచుకుంటారు.
ఆట్టే ఎండ, గాలి తగల కుండా, జాగ్రత్తగా ఎండబెట్టాలి. అనగా వడియాలు చేసాక,
ఎండబెట్టే కార్యక్రమంలో ఎక్కువ  శ్రద్ధ అవసరము.
ఎండ ఎక్కువైతే, వడియాలు పొడి  పొడిగా ఐపోతాయి.వాతావరణము పొడిగా, తేమ తక్కువగా ఉండాలి.
నీరెండలో మాత్రమే ఈ వడియాలను ఎండ బెట్ట వచ్చును.
అందువలననే వీటిని ఒకేసారి చాలా ఎక్కువగా చేసుకుని, పెద్ద మొత్తాలుగా నిలువ చేసి వాడుకుంటారు.
బొరీలను, జిలేబీల మాదిరిగా, స్పీడుగా  డిజైన్ లతో చేయడం,
అనుభవం మీద సంపాదించే కళా విద్య  అనొచ్చు. చెవుల లోలాకులు,  నెక్లేసులు, కిరీటాలు, పక్షులు,
కర్ణాభరణాలు, రక రకాల ఆకారాలు రూపొందుతాయి.ఇప్పుడు బెంగాల్  స్థానిక మార్కెట్టులో ఇవి లభిస్తున్నాయి.
- కాదంబరి
This entry was posted in వ్యాసాలు and tagged ఆభరణ వడియాలు, కాదంబరి, కార్తీక మాసం, కుటీర పరిశ్రమ, బెంగాల్, రబీంద్ర నాథ్ టాగోర్, Gayna Bori, Lentil. Bookmark the permalink. 
ఆభరణ వడియాలు (బొరీలు)   (Link for extra matter )Link 2 read simple food (link 3 read ) విహంగ      (link for Essay)
Posted on June,2011 by విహంగGayna Bori, ornament vadiyamulu ; 
           A Home maker's Diary (India): Gayna/ Naksha Bori (Sundried Lentil paste Designs)
( helping essay- "ఆభరణాలను పోలే వడియాలు, అర్నబ్ దత్తా, కలకతా")

10, జులై 2011, ఆదివారం

ఉదాహరణ వాఙ్మయమును వెలుగులోకి తెచ్చిన నిడదవోలు వెంకట్రావు

 

















                                                                                                              ఆధునికసారస్వతములో- ప్రాచీన సాహిత్యముపై, ముఖ్యంగా ఉదాహరణ వాఙ్మయముపై విశేష కృషి చేసిన దిగ్దంతులలో ఒకరు నిడదవోలు వెంకట్రావు. "మహాశ్వేత" కొక్కొండ వెంకటరత్నం మొదటి నవల- ఇత్యాది  నిర్దిష్ట ప్రామాణిక అభిప్రాయాలను  వెలిబుచ్చిన వ్యక్తి నిడదవోలు వెంకట్రావు.మయూర కృత “సూర్య దండకమ్”ను, “శివ స్తవమ్ ” లను వెలుగులోకి తెచ్చిన ఘనత వీరిదే! 
"ప్రథిత వేదము వేంకట రాయ శాస్త్రి ;                                                                                                    పొందగా బుట్టిన కళాప్రపూర్ణ బిరుదు;  సార్ధంబయ్యె సాహిత్య జగతి నేడు ;నిడుదవోల్వేంకట రాణ్మనీషి వలన." 

1973 లో సన్మాన పురస్కారలతో, కవుల కైవారములను ఈలాగున అందుకున్నారు. “కళా ప్రపూర్ణ”, “పరిశోధన పరమేశ్వర” మున్నగు బిరుదులను పొందారు. నిడదవోలు వేంకటరావు ఉదాహరణ  వాఙ్మయ చరిత్రను రచించారు. తరువాత విశ్వనాథ సత్యనారాయణ బోటి ఉద్ధండులు, మరుగున పడిన ఈ ఉదాహరణ శాఖపై దృష్టి సారించి, ఆ రచనలను చేసారు. 35 మంది పైన కవులు ఇలాగ ఉదాహరణ వాఙ్మయములో రచనలు చేసారు. అందువలననే - “ఉదాహరణ వాఙ్మయోద్ధారక” అని కీర్తించబడ్డారు. “జంగమ విజ్ఞాన సర్వస్వము”, “ఏక సంథాగ్రాహి”, “కళా ప్రపూర్ణ”, “పరిశోధన పరమేశ్వర” మున్నగు బిరుదులను పొందారు.తిరుపతి ఓరియంటల్ కాలేజీ లైబ్రరీకి వారు అనేక పుస్తకాలను దానం చేసారు.. ఆయన హైస్కూలు, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ, బి.ఎ. విజయనగరంలోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితులు కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. ఒకసందర్భంలో తిరుమల రామచంద్రగారు “వెంకటరావుగారు కారణాంతరాలవల్ల ఎం.ఏ. చెయ్యలేదు” అంటే సమాధానంగా వెంకటరావుగారు, “కారణాంతరాలవల్ల యం.ఏ. చేసాను” అన్నారుట. "ఎలా?" అని అడిగితే "ఇలా.." అని వివరించారు ఆయన...“ఈనాడు విశ్వవిద్యాలయములలో నున్నవారికి నాకు నొకటే బేధమున్నది..బ్యాంకు అంకెలమయము. సాహిత్యము అక్షరమయము. నేను అంకెలనుండి అక్షరములలోనికి రాగా, నేటి  విశ్వవిద్యాలయమున నున్నవారు అక్షరములనుండి అంకెలలోనికి వచ్చినారు.” అన్నారు, చమత్కరిస్తూ.వెంకటరావుగారు 1944 నుండీ 1964వరకూ మద్రాసువిశ్వవిద్యాలయంలో జూనియర్ లెక్చరర్‌గా మొదలుపెట్టి, తెలుగుశాఖ అధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు. ఈవిషయంలో “నన్ను విరమింపజేసినారు” అని ఆయన రాసుకున్నారు - అంటే యూనివర్సిటీవారు ఒత్తిడి చేసేరనే అనుకోవాలి."బలి, దానం చేత (పొట్టి అయాడు) అడుగున పడిపోయాడు. బలిదానంచేత శ్రీ పొట్టి శ్రీరాములు పొడుగైనాడు" మున్నగు స్ఫూర్తిదాయక నుడువులు ప్రశస్తి  పొంది, ప్రచారము లోనికి వచ్చాయి.
నిడుదవోలు వెంకటరావుగారి సాహిత్యంమీద నిష్టల వెంకటరావుగారు పరిశీలన చేసారు.  
ఆధారము:-
[యువభారతి- ప్రచరణ వ్యాస సంకలని] 

                Link - Web patrika 


 

2, జులై 2011, శనివారం

జాలి గుండె (కథా రూపకం)

























                                          సౌందర్య కాంతులతో భాసిల్లుతూ, వైభవంగా విలసిల్లుతూన్న వైకుంఠము అదిగో! అల్లదిగో!
ఆ నగరి లోపల,
ఆ సౌధాంతరమందున
ఆ నిత్య నూతన దంపతులు ఆటలో లీనమై ఉన్నారు.
లోకములను ఆడించే వాడు నారాయణుడు,
ఎల్ల ప్రజలకూ ఆసక్తిదాయకమై, పూజించబడుచున్న శ్రీ లక్ష్మీ దేవి,
ఇరువురి క్రీడ రసకందాయ రంజనమై సాగుతూన్నది.
ఎందరో జీవిత గమనాలనో మార్చిన “పాచికల ఆట” అది.
ఉభయుల ద్యూతక్రీడకు చిన్నపాటి అంతరాయన్ని కలిగించింది
నారద మహాముని సుస్వర నినాద భజన.
“నారాయణ! నారాయణ!”
చిద్విలాస వదనములతో, భార్యా భర్తలు సుంత ఆగి, ఇటు దృష్టి మరల్చారు.
“ఆడించేదీ నీవే!
అందరితో ఆడే వాడివి నీవే!
లీలా మానుష సూత్రధారీ!
నారద మానస సుధా ఝరీ విహారీ!
ఆదియు, అంతము లేని వాడా!
అంతట నిండిన వాడివి నీవే!
నా హృదయ డోలలో ఊగగ రావోయీ!
నారాయణ! నారాయణ! ”
క్షీర సాగర కెరటాల నురుగులు
నారదుని చరణాలనూ, దుస్తుల అంచుల పైన పడుతూన్నాయి.
“నారద చంద్రమా! సుస్వాగతము మౌనీశా!”
“నమస్సుమాంజలులివే తాత గారూ! క్షీరాబ్ధిని చూస్తూంటే, అనిపిస్తూన్నది, దేవా!”
నారాయణుడు అడిగాడు
“ఏమని అనిపిస్తున్నది మౌనీంద్రా!”
“భూలోక వాసులు ఉష్ణ పానీయాలను ఉదయ వేళలలో నిత్యమూ సేవిస్తూన్నారు.
ఈ సారి నేను టీ, కాఫీ పొడి ద్రవ్యాలను తెస్తాను,
ఈ పాలు కలిపి, కొత్త పానీయాన్ని మీకు కూడా రుచి చూపిస్తాను, నానమ్మా!”
‘తనను కూడా పలుకరించ లేదే!?
ఈ మనుమడికి స్త్రీలు అంటే తగని ఉపేక్ష కదా! ’
అని మనసులో రవంత కినుక మొలకెత్తింది,
ఆమెకు.కోపం చిటికెలో మంత్రం వేసి తీసినట్లు పోయింది,
ఇందిరా దేవి .దరహాసనన ఐ, ఆశీస్సులను ఒసగుతూ, పలకరించినది,
“చిరంజీవ! సుఖీ భావ! నారదా!”
శ్రీ పతి, విష్ణు మూర్తి అడిగాడు
“ ఏమి నారదా!! ఏమిటి విశేషాలు? ఊరక రారు మహానుభావులు!?!
భూ లోకం నుండి ఎలాంటి సమాచారములను మోసుకు వచ్చావు ఋషివరా!”
“ మోసుకు వచ్చినవి మాత్రం ఇవిగో!
ఈ చిరుతలూ, తంబురా !
తీసుకు వచ్చిన వార్తలు మాత్రం కో కొల్లలు.”
“ఆహా! ఐతే  ఆ వార్తలనే వాటిని నా చెనిని వెయ్యి స్వామీ!” అన్నాడు శ్రీ పతి.
శ్రీ నాథుడు పృచ్ఛకుడు, అవధాన ప్రియత్వము త్రిలోక సంచారి నారదునిది.
కుతూహలతతో మిళాయించిన ఆ క్వశ్చన్ కు బదులు ఇచ్చాడు త్వముని.
“కుప్పించి, ఎగసి దూకే కుండలముల కాంతితో విరాజిల్లే
ఆ నీ శ్రవణేంద్రీయాలలో నీ చెవులలో
పుంఖానుపుంఖాలుగా ఉన్న ఊసులను చెప్ప గలగడం నా భాగ్యమే స్వామీ!
చెప్పడం మొదలు పెట్టాక యుగాలు, కల్పాలూ పట్ట వచ్చును దేవరా!
కానీ మీ దంపతుల పాచికల ఆటకు నడి మధ్యలో భంగము కలిగించిన వాడిని ఔతానేమో!”
నారాయణుడు మందస్మితాననముతో వక్కాణించాడు.  
“క్రీడా భంగం కాబోదులే  ఋషీంద్రా!”
“అహ! మాతామహి పద్మాలయకు మీ పైన ఆగ్రహము రావొచ్చునేమో!?!-
స్వామి వారికి నా మీద కంటే ఈ జడలమారి మనవడి మీదే మక్కువ ఎక్కువ ఐనదే- అని!”
అని అంటూ త్రిలోక సంచారి ఆమె వంక చూసాడు.
రమా దేవి నవ్వుతూ అన్నది “అప్పుడే తగవులు పెట్టడం మొదలు పెట్టావా కలహ భోజనా!
జగన్నాటక సూత్ర ధారి మీ పితామహులు! అనంత విశ్వాన్నే నియంత్రించే శ్రీ పతికి –
ఈ చిన్న ఆట ఒక లెక్కలోనిదా!
తానే గనుక తలచు కుంటే నీతోనూ, మరి నాతోనూ ఏక కాలంలో ఆడ గలరు”
“సత్యం! సత్యం! పునః  సత్యం! అమ్మా! శ్రీ క్రిష్ణావతారము రోజులప్పుడు – నీతో పాటు పదహారు వేల మంది
రమణీ మణులతో రాస క్రీడలు ఆడిన వాడు – ఆ లీలా మానుష క్రీడా లోలుడే కదా అవ్వా!” అన్నాడు
నారదుడు.
విష్ణు పత్ని అధరాలు వణకగా, బుంగ మూతి పెట్టి పలికింది
“ఇప్పుడవన్నీ జ్ఞాపకం చేసుకోవడం ఎందుకులే మౌనీంద్రా!”
వెను వెంటనే సతి వాగ్బాణాలను అందుకుని,
తటాలున వైకుంఠ వాసుడు, తడబాటుతో అన్నాడు
”ప్రస్తుతము ఆ అప్రస్తుత విషయాల ప్రశంసలు ఎందుకయ్యా కలహాశనా!
మనుజ లోకపు విశేషాలను – ఏదీ…. కాస్త పూస గుచ్చినట్లుగా చెప్పు చూద్దాం!”
ఆ తాతయ్య అభ్యర్ధనను కాదన గలడా ఈ మనుమడు!
“అమ్మమ్మమ్మా! ఏమని వివరించగల వాడిని నేను!
ధర్మ దేవత ఒంటి పాదము మీద నిలబడి, ఆక్రోశిస్తూన్నది.
ఎక్కడ చూచినా అధర్మమూ, అసత్యమూ, అశాంతీ,
ప్చ్! అంతః కలహాలున్నూ.
నారాయణ! నారాయణ! పెదవులకు అలవి కాదు వివరించడానికి.”
“అంత ఎక్కువగా ఉన్నాయా?” నారాయణుని మోముపై ఉద్భవిల్లినది ఒక ఆశ్చర్యార్ధకము!!!!!
బ్రహ్మ మానస పుత్రుడు – సంభాషణను ఇంకా కొనసాగించాడు
…. కాంతా కనకాల కోసం మారణ హోమాలు,
ధన ధాన్యాల కోసం దారుణ కృత్యాలు,
పిడికెడు బియ్యం కోసం పెనుగులాటలు,
అందని పదవుల కోసం పైశాచిక కృత్యాలు,
స్వార్ధంతో ధన మదాంధుల పరవళ్ళు,
క్రుద్ధతతో క్షుద్భాధితుల కలరవాలు,
భాగ్యవంతులు తమ కుక్క పిల్లలకు విందులు చేస్తుంటే –
నిరుపేదలు పుల్లి(వి)స్తరాకుల కోసం
ఊర కుక్కలతో కొట్లాడుతూంటారు”
“పాపం!” జాలి పడుతూ అన్నారు రమా రమణుడు, ఆయన పత్నీ.
మళ్ళీ నారదుడు అందుకున్నాడు ఇలా,
“మురుగు కాల్వల పక్కన పందుల కంటే హీనంగా పొర్లాడుతున్నారు.
చి చీ ఛీ!ఛీ!! వాళ్ళను చూడాలంటేనే పరమ రోత!”
“ఏమిటి నారదా! వాళ్ళను చూసి, జాలి పడవలసింది పోయి,
ఏవగించుకుంటున్నావా!?,”
మురారి విభ్రమంగా అన్నాడు.
“జాలి పడాలా! వాళ్ళకి పని చేసుకుని సుఖంగా బతకడం తెలీదు.
కష్ట పడటం ఇష్ట పడని సోమరి పోతులు.
అడుక్కు తింటూ మట్టిలో పొర్లాడుతూండడంలోనే వాళ్ళకి సుఖం ఉంది.”
దేవర్షి ఆవేశం అది.
“అన్నట్లు నారదా! నా భక్తుడు వెంకట క్రిష్ణుడు ఎలా ఉన్నాడు?”
భూలోకంలోని తన భక్తుని గురించిన జిజ్ఞాసతో నారాయణ మూర్తి క్వశ్చన్ మార్క్.
“ఏ వేంకట క్రిష్ణుడు?……
ఓహో! …….
ఆ …… సత్య సుందర వీర గోవింద అచ్యుత జనార్దన వెంకట క్రిష్ణ స్వామేనా?”
ఆయాసం తీర్చుకుంటూ,
“నిక్షేపంగా ఉన్నాడు, తమ దయ వలన కోటికి పడగలెత్తాడు”
“కోట్లకు పడగలెత్తాడో, కాటు వేయడానికి పడగలెత్తాడో గమనించాలి నారద మునివర్యా!”
“లేదు స్వామీ! అయినా తమ భక్తుడు కదా!
విషపు బుసలను ఎందుకు కొడతాడు?” కొంచెం నసుగుతూ పలికాడు సరస్వతీ పుత్రుడు.
“మనిషి విపత్తులలో ఉన్నప్పుడు
భగవంతుడనే మహా వృక్షం భక్తి
అనే తరు ఛాయలలో తల దాచుకొన జూస్తాడు.
కానీ ఆ నీడలో ఆశ్రయానందం లభించగానే
ఈ మహా పాదపం సర్వం తన స్వంతమనే అహము కలుగుతుంది.
సర్వం సహా తన హక్కులే అనే ఆభిజాత్యంతో, మద గర్వంతో విర్ర వీగుతాడు.
చివరికి భూరుహము యొక్క ఫల పుష్పాదులే కాకుండా,
శాఖా, మూలములను కూడా అనుభవించే ఆశ ఆక్రమిస్తుంది.
ఫలితంగా స్వార్ధపూరితుడై, పవిత్ర వృక్షమును నిలువెల్లా అమ్ముకుని,
వ్యాపారం చేయాలని యత్నిస్తాడు ”
అనర్గళంగా సాగింది ఆ నీల మోహన స్వామి వాక్ప్రవాహము.
వెంటనే నారద ముని “ఐతే ఆ సత్య సుందర వీర …….
హ్! ఎందుకు లెండి?
ఆ వెంకట క్రిష్ణయ్య కూడా ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నాడంటారా?” అడిగాడు.
“ఏమో? నువ్వే వెళ్ళి చూడు! నీకు మూడు నెలలు గడువు ఇస్తున్నాను.
నీ దేవత్వాన్ని కొద్ది కాలము పాటు ఉపసంహరిస్తున్నాను.
నీవు ఆ మనుషులలో ఒక మనిషిగా సంచరించి,
వాస్తవ పరిస్థితులను ఆకళింపు చేసుకో!”
అంటూ, శ్రీ మహా విష్ణువు నారదుని భూలోకానికి వెళ్ళమని చెప్పాడు.
“శేష శయనా! ఈ మహదవకాశాన్ని
నాకు ప్రసాదించినందుకు, ధన్యుణ్ణి!
ఈ సరి కొత్త అవకాశం నిఖిల లోక కళ్యాణానికై వినియోగపడును గాక!
కానీ…. స్వామీ!…….”
“ఊ! కానీ….. ?” అర్ధోక్తిలో ఆగిన ఋషీంద్రుని అడిగాడు పాల కడలి వాసుడు.
“మరీ…… క్షీరాబ్ధి వాసీ!
నాకు అవసర సమయాలలో నాకు అండగా నిలబడతానని
తమరు నాకు మాట ఇవ్వాలని నా మనవి.
అలాంటి మానవారణ్యంలో మెలగడానికి నాకు ధైర్యం వస్తుంది”
“పైగా ఇదొకటా! సరే! అటులనే!”
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అభయము  నిచ్చాడు.
“ధన్యోస్మి దేవరా! అభయ వర ప్రదాతా!
నాకు కొండంత అండగా నీవుంటే  మహా పర్వతాలను సైతం
ఇట్టే ఢీకొనగలను. నారాయణ! నారాయణ!”
తత్క్షణమే నారాయణుడు ఒసగిన నరుని వేషం సంప్రాప్తమైనది.
భూ లోకంలో వ్యవసాయ క్షేత్రంలో ఒకడు నేలను దున్నుతున్నాడు.
ఆ పొలంలో సాగు చేస్తూ పాటుబడుతూన్న వాడే నారదుడు.
“హెయ్! హెయ్!” కాడెద్దులను అదిలిస్తూన్నాడు,
కానీ అవి అతని మాట వినట్లేదు.
“హెయ్! హెయ్! వీటి దుంప తెగ! ఈ ఎద్దులు మాట వింటే గదా!
క్రిష్ణ! క్రిష్ణ! ఈ కష్టాలు పగ వాళ్ళకు కూడా వద్దు నాయనా!”
అస్సురుస్సురంటూ చతికిల బడ్డాడు.
ఎట్ట ఎదుట శ్రీ కృష్ణుడు ప్రత్యక్షమైనాడు.
“అలసి పోయావా నారదా!?”
తేరి పారా చూస్తాడు నరునిగా ఉన్న్ నారదుడు.
“నా నోట్లో మాట నోట్లో ఉండగానే సాక్షాత్కరించావా భక్త వత్సలా!
అ…. ఇదేమిటి స్వామీ! మళ్ళీ క్రిష్ణావతారం దాల్చావు,
ఇది ద్వాపర యుగం కాదు కదా?”
మందహాసం చేసాడు క్రిష్ణుడు
“కాదు నారదా! ప్రస్తుతం నువు కలియుగంలోనే ఉన్నావు.
వేంకట క్రిష్ణుని పొలంలోనే సేద్యం చేస్తూ నా ప్రక్కనే నిలబడి ఉన్నావు”
“అహా! క్రిష్ణయ్యా!!!!! నువ్వు నా పక్కన ఉంటే
వేంకట క్రిష్ణుని మాగాణి పొలాన్నే కాదు,
గిరిజా, గంగా పతి బంజరు భీడు భూములనైనా సరే!
ఇట్టే చిటికెలో దున్నీసేయగల్ను.
అది సరే గానీ స్వామీ!…………..
తాము ఇప్పుడిలాగ శ్రీ క్రిష్ణావతారం ఎత్తారెందుకని? గోవర్ధనోద్ధారా!”
“నీ  అంగుళీ వాయిద్య వాదనము సమ్మోహనంగా ఉంది.
ఏదీ, మరొక్కసారి చూపించు విరించీ పుత్రా!”
ఆది విష్ణువు పృచ్ఛ అది.
“అంగుళీ వాద్యమా? … ఆహా! వ్రేళ్ళతో చిటికెలు వేయడమా?
ఇదిగో, ఇలా బొటనవేలును మధ్య వేలుతో తాటిస్తూ, రాపాడిస్తే,
చిటికెలు వస్తాయి. చిటికెలు వేసే విద్య ధరణిజులకు వెన్నతో పెట్టిన విద్య. ”
నారద వాక్కులు.
“వ్రేపల్లెలో లాగా మళ్ళీ నవనీతం తినాలని అనిపించేలా చేస్తున్నావు, నారదా!”
“మాట మార్చి, నన్ను ఏమార్చి, బులిపిస్తూన్నావు, స్వామీ!
ప్రస్తుత అవతార అవతరణా రహస్యాన్ని విడమరిచి చెప్పండి.”
“ అదా?! ‘యే యథా మాం ప్రపద్యంతే; తాం స్తథైవ భజామ్యహం||’
ఎవరెవరు ఏయే రూపాల్లో నన్ను కొలుస్తారో వారిని ఆ విధంగానే ఆదరిస్తాను.
నువ్వు నన్ను ‘కృష్ణా! కృష్ణా!’ అని తలిచావు కదా!
అందుకనే నీకు క్రిష్ణునిగా సాక్షాత్కరించాను,
ఇదీ ప్రస్తుతాలంకారం. అదే ‘రామా! రామా!’అని తలిస్తే …….
శ్రీరామ చంద్రునిగా నీ ముందర నిలిచి ఉండే వాణ్ణి.”
“వద్దు,వద్దు స్వామీ రామావతారంలో జానకీ నాధునిగా
ఏకపత్నీ వ్రతంతో ఏ మాత్రం సుఖపడ్డావు గనుక!!!
గోకులంలో చిలిపి ఆటలు ఆడి, అష్ట మహిషులతో కూడి,
వైభోగాలతో తులతూగిన నీ క్రిష్ణావతారమే నయనానందకరమూ,
హృదయానంద సమ్మోహన కరమున్నూ! శిహిపింఛధారీ!
ఆ క్రిష్ణావతారమునే నేత్రపర్వదాయకముగా ఉండనీవయ్యా!”
మైమరపుగా నొక్కి వక్కాణిస్తూ
పలుకుల పందిరి ఐనాడు ఆ సుర మౌని.
“ఐతే శ్రీ కృష్ణునిగా – నీకు ఆ విషయంలో మాత్రమే ఆదర్శం అయ్యానన్న మాట!”
నారదుడు వెనక్కి తిరిగి చూసి , గాభరాగా పరుగులు తీసాడు.
“అయ్య్! అయ్యొ! అయ్యయ్యో! ఎడ్లు బురదలో పొర్లాడుతూన్నాయి.
ఛి ఛీ! ఇప్పుడెలా? వాటితోటే పొలం దున్నాలి.”
క్రిష్ణ రూపంలోని విష్ణు మూర్తి సముదాయిస్తూ అన్నాడు
“బెంబేలు పడకు త్రి లోక సంచారీ!
కొంచెం తాలిమి తాలిమి వహించు!
ఎద్దులను ఆ కాలువలో కడిగి, శుభ్ర పర్చి, తెస్తాను. ”
“ఆ! ఔరా! విచిత్రము!” నారదుడు ఆశ్చర్యంతో
నోరు ఆవలించి, చూడ సాగాడు.
జడ ధారి అలాగ విభ్రమావథలో ఉండగానే,
మురళీ, పింఛధారి గేదెల జతను బాగా పరిశుభ్ర పరచి, తీసుకు వచ్చాడు.
“చూడు! ఎలా కడిగానో????”  అడిగిన వాడు క్రిష్ణుడు.
“ నీ చేయి పడినాక, ఈ వృషభ ద్వయం – చెప్పక్కర్లేదు-
ఆహా! నిజంగా ఆణి ముత్యాలల్లే మురిపంగా,మెరిసి పోతున్నాయి.”అన్నాడు.
“నారదా! నువ్వు బాగా అలసి పోయావు.
కాస్సేపు అటు కూర్చుని, విశ్రాంతి తీసుకో!
నేను ఈ భూమిని దున్నుతాను.”
“ఛ్! ఛ్! వద్దు స్వామీ!”కంగారుగా అన్నాడు నారదుడు.
“ ఫర్వా లేదులే! కూర్చో! నారదా! చూస్తూండు!
ఒక్క అర గంటలో అరక దించేస్తాను గదా!”
ఆ స్థిత ప్రజ్ఞుని పల్లవాధరాల నుండి స్నిగ్ధంగా వెలువడినాయి .
“ స్వామీ! భక్త వత్సలా! ఈ నారదుని వలన నీకు ఎన్ని పాట్లు వచ్చాయి.
దేవా! ఒక జడ ధారి కష్టాలలో పాలు పంచుకోవడానికై ఇచ్చోటికి దిగి వచ్చావు గదా!”
అంటూ స్తోత్రం చేసాడు.
“నారద మునీంద్రా! వాటిని అలా అదిలిస్తే మాట వినవు.
వాటిని కూడా సాటి ప్రాణి లాగా వాత్సల్యంతో పోషించాలి.
ప్రతి రోజూ నా  అశ్వాలను నేనే స్వయంగా మర్దనలూ,మాలీసులూ చేసే వాడిని.
వాటికి నేనే గుగ్గిళ్ళు, ఆహారము పెట్టేవాడిని.
అందు వలననే అవి నా కను సన్నలలో మెలుగుతూండేవి.
నా నేత్ర సంజ్ఞలతోనే ఆ జవనాశ్వాలు వాయు వేగంతో పరుగులు పెట్టేవి.
కనుకనే నేను పార్థ సారధిగా ప్రఖ్యాతి వహించ గలిగాను.” కృష్ణుని వాణి మృదు మధురము.
“అర్ధమైనది స్వామీ! నిన్ను కేవలం గోపికాలోలునిగానే ఆదర్శంగా తీసుకున్నాను.
నా అజ్ఞానాన్ని క్షమించు. నా కళ్ళు తరిపించినావు.
అర్జునుని అనంతరం గీతా రహస్యాన్ని నాకు సాక్షాత్కరింప జేసినావు.
ధన్యోస్మి! ధన్యోస్మి! ” తన్మయుడౌతూ
భక్తి పారవశ్య మానసముతో చేతులు జోడిస్తూ అన్నాడు ముని.
“మరి భక్తి మత్తులో శ్రమ సిద్ధాంతాన్ని గాలికి వదిలేస్తావా? ”
శ్రీ క్రిష్ణ ప్రశ్న అది.
“మర్చిపోలేదు స్వామీ!
మళ్ళీ ఈ రేగడి నేలలో విత్తులు చల్లాలి, నారు పోయాలి”
వెళుతూ అన్నాడు క్రిష్ణ భక్తుడు.
“శుభం! అయితే ఇప్పుడే మొదలు పెట్టు”
ఆ పలుకులు వినీ వినగానే నారదుడు కృషీవలునిగా మారాడు,
తన పని తాను చేసుకు పోతున్నాడు.
“అలాగ నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవడానికి
ఇది మౌని కర్మ కాదు. నారదా!
ఇది వ్యవసాయము. నేను కూడా సాయపడనా?
పాట పాడుతూ పని చేయి! అపుడు ఉత్సాహంగా ఉంటుంది”
“సరే స్వామీ! అలాగే!
నువ్వు నన్ను కాస్తంత అవలోకిస్తూంటే చాలును”
గోపాలుని మాటలకు బదులు చెప్పాడు నారదుడు.
నారదుని గళము శృతి పోసుకున్నది.
“ నారద మానస డోలా విహారీ!…..”
అని ఆరంభించాడు ఆ ఋషివరేణ్యుడు.
“ఆ! ఆ! పొలం పని చేసేటప్పుడు అలాంటి పాట కాదు మునివర్యా! ఊ….
పని పాటులలో కులాసా పాటలు పాడాలి. విను!”
క్రిష్ణ గానంతో పరిసరాలు పులకిస్తూన్నాయి.
“వానల్లు కురవాలి వాన దేవుడా!
వరి చేలు పండాలి వాన దేవుడా!
దుక్కుల్లు దున్నాలి వాన దేవుడా!
విత్తుల్లు చల్లాలి వాన దేవుడా!”
క్రిష్ణ మూర్తి  అతనిని ఉల్లాసపరుస్తూన్నాడు.
ఇంతలో నారదుడు బిగ్గరగా అన్నాడు
“అదిగో! అడుగో!  యజమాని వస్తున్నారు”
“ఎవరు? ఆ నామాల వ్యక్తేనా?”
“ఆ!ఆ! ఆ నిలువు నామాల మనిషే!
పూర్వం భక్తిపూర్వకంగా, దైవ  చిహ్నంగా నామాలను తీర్చిదిద్ది పెట్టుకునేవాడు.
ఇప్పుడు భక్తి జలం ఇంకి పోయి, చిహ్నాలూ, మచ్చలూ మిగిలాయి.
ప్రస్తుతం ఎదుటి వారికి నామాలు పెట్టడానికి మాత్రమే పెట్టుకుంటూన్నాడు”
అన్నాడు నారదుడు.
“అయితే నీ అనుభవపరిపాకం బాగా గట్టిపడినట్లుగనే ఉన్నది!”
“సరే! నేను వెళుతున్నాను. నీకు అవసరమైనప్పుడు వస్తాను.” మాయమైనాడు.
క్షేత్ర యజమాని వెంకట క్రిష్ణయ్య వచ్చాడు.
“ఏంటయ్యా నారయ్యా!!!
దిక్కు లేని వాడిని  అంటూ కాళ్ళా వేళ్ళా పడి,
బ్రతిమాలావు కదా అని ఏదో జాలి పడి
నీకు పని ఇచ్చినందుకు బాగానే చేస్తూన్నావు నిర్వాకం!
హ్హు......!  పొలం దున్నడం, విత్తులు జల్లటం ఇలాగేనా?
నా మొహంలా ఉంది.” గగ్గోలుగా కేకలు వేసాడు.
నారదుడు ఒకింత భయంతో వినయంగా అన్నాడు
"విత్తనాలు చల్లడం – మీ మొహంలాగా ఉన్నదనే
విషయం నిజమే కావొచ్చు గానీ,
పొలం దున్నడంలో లోపాలను ఎంచకండి.
సాక్షాత్తూ ఆ దేవ దేవుడే దిగి వచ్చి దున్నాడు.
ఆ నాగేటి చాళ్ళను తిలకించండి………
పట్టు చీరకు నేసిన సరిగంచులకు మల్లే ఉన్నాయి కదుటండీ!!! ”
“నా మాటకే బదులు చెబ్తున్నావా?
చెప్పుతో కొట్టే వాళ్ళు లేకపోతే సరి? మాటకు మాట చెబుతావేం???
హన్నన్నా! పనిలో చేరి వారం రోజులు కూడా కానే లేదూ
అప్పుడే నన్నెదిరిస్తున్నావా? ”
అతడు రౌద్రంతో గంతులు వేయసాగాడు.
“బాబ్బాబు! అలా సెలవీయకండి.
నాకిప్పుడే తెలిసి వచ్చింది తమ బోంట్ల వద్ద ఎలా మెలగాలో;
ఇక నుండి తమరు నంది అంటే నందే, పంది అంటే పందే.”
“అంటే నేను అవాకులూ, చెవాకులూ పేల్తున్నాననే కదూ, నీ వ్యంగ్యం?
నీకూ, నీ పనికీ ఓ పేద్ద దణ్ణం. ఇక దయ చెయ్!”
“అయ్యా!అయ్యా!”నారదయ్య ప్రాధేయ పడ్డాడు.
“చెబ్తూంటే నీక్కాదూ! ఇక ఫో!
ఏ నిమిషాన వచ్చావో గానీ,
నా పని వాళ్ళందరికీ నేను అన్యాయాలూ, అధర్మాలూ  చేస్తున్నానని నూరిపోస్తున్నావు?!
పేనుపై జాలి పడితే తలంతా తెగ కొరికిందట!
అలాగ ఉంది నీ వ్యవహారం! ఫో! ఫో! ”
యజమాని ఉగ్రత్వాన్ని తలుచుకుంటూ, రోడ్డు మీద నడవ సాగాడు నారదయ్య.
“ పని కాస్తా ఊడింది. అర్భకావతారంగా ఉన్నానని
ఎవ్వడూ పని ఇవ్వడం లేదు. యాయవారమూ, ఉపాదానానికి వెళ్తున్నానా,
‘నీకు కాళ్ళూ, చేతులూ ఉన్నాయి కదా!
ముష్టెత్తుకోవడానికి సిగ్గు లేదూ!
పని చేసుకుని బతకరాదూ!
పనిపాటులు లేకుండా సోమరితనాన్ని మరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు.’
అంటూ ఎవళ్ళూ ముష్టి కూడా వేయడం లేదు. ఆకలి దంచేస్తూన్నది.
అబ్బా! దాహం!”  అటూ ఇటూ చూసాడు, నల్లా అగుపడింది.
“హమ్మయ్య! అదిగో! అక్కడ జల దాయిని ఉన్నది.
నోరు పిడచ గట్టుకు పోతూంటే, వర్ష మేఘం వలే కనబడింది. అమ్మయ్య!”
వెళ్ళాడు నారయ్య.
అంతలో పోలీసు వచ్చి, అదిలించాడు.
“ఏయ్! ఎవరు నువ్వు? ఇది మునిసిపాలిటీ పంపు.
డబ్బులు కట్టకుండా తాగుతూన్నావేమిటి?
ముందర మనీ కట్టు, ఆనక కుత్తుక దాకా తాగు! ఎవరూ కాదన్రు.”
‘ఓహో! ఈ గొట్టమును పంపు అని పిలుస్తున్నారా?’
అని మనసులో అనుకున్నాడు నారదయ్య;
“ఏమిటీ పంచభూతాల్లో ఒకటైన
నీటికి కూడా మూల్యం చెల్లించాలా?
నా దగ్గర ఎర్ర ఏగాణీ లేదు. బాబూ!
దాహానికి డబ్బులు ఇవ్వాలని నాకు తెలీదు,
సరస్వతి తోడు అంటే మా అమ్మ తోడు.”
“తెలీదూ, గాడిద కొడకా!” పోలీసు  కోపంతో కొట్టాడు.
బీటు పోలీసు కొట్టిన దెబ్బకు
గింగిర్లు తిరుగుతూ నారయ్య కిందపడ్డాడు.
“కొట్టకు బాబూ! కొట్టొద్దు నాయనా!
నేను గాడిద కొడుకును కాదు, బ్రహ్మ కుమారుణ్ణి!”
“ఏందిరా వాగుతున్నావ్?!
ఐతే నువ్వు పిచ్చోడివన్న మాట!
వీడు పిచ్చోడు! తన్నండిరా తన్నండి!”
అంటూ ఆ భారత రాష్ట్ర రక్షక భటుడు
మళ్ళీ చపేటం ఇచ్చుకున్నాడు.
జనం కూడా తన్న సాగారు.
నారయ్య ఉరఫ్ నారదుడు కాలికి బుద్ధి చెప్పాడు.
“అమ్మా! ఎండ! కాళ్ళంటుకు పోతున్నాయి.
అదిగో! ఆ చెట్టు కింద నిలబడతను.”
అని అక్కడి ఒక తరు ఛాయలోఆగాడు.
ఆ తరు ఛాయలో కూరలు అమ్ముకుంటూన్న చిరు వ్యాపారి
“గయ్! గయ్ ”మంటూ తాడెత్తున గెంత సాగాడు.
“ఏయ్! ఎవర్నువ్వు? ఈ చెట్టు నీడ నాది.
నెల నెలా డబ్బులు కట్టుకుంటున్నా.
ఈ ప్లేసు (place) లో ఈ పూట ఉండే హక్కు నాకే ఉంది.
అర్ధమైందా?”
“అంటే భూరుహమ ఇచ్చే చల్లని నీడకు కూడా
మూల్యాన్ని చెల్లించాల్సిందేనా?
ఇదేం లోకం బాబోయ్,
ఆ ….. భూలోకం కదూ!…. హుష్!…..” నడవ సాగాడు.
“పైన తలా, కింద అరి కాళ్ళూ అంటుకుపోతున్నాయి.
ఎండ తీక్షణత – కలి యుగంలోని అధర్మంలా భగ భగ మంటున్నది.
ఆకలి! ఆకలి, దాహం… నాలిక పిడచ కడుతూన్నది.
అంటూ అక్కడికి అన్నం తెచ్చుకుని తింటూన్న బిచ్చగాడికేసి చూస్తున్నాడు.
“ఎవరయ్యా నువ్వు? అలా చూస్తూన్నావు.
ఆకలేస్తోదా? ఇంద! ఈ నాలుగు విస్తళ్ళనూ నువ్వే తీస్కోలే!” ముష్ఠి  వాడు ఇవ్వబోయాడు.
“ ఛి ఛీ, పుల్లిస్తరాకుల్లోదా? ఎంగిలీ మంగలం ! ”
నారదుడు ఛీదరింపులు.
“అయితే మరీ మంచిది.” అనేసి,
అక్కడ తచ్చాడే శునకాన్ని చూచిన యాచకుడు,
” చై ఛై ఎదవ కుక్క…” అని కసిరాడు.
మళ్ళీ కాసింత జాలి పడి, “జ్జు జ్జూ దా దా!” అని పిలుస్తూ
రెండు కడిలు/ ముద్ద వేసి, మిగతాది తాను తినేసాడు.
“ఇదిగో! సన్నాసయ్యా! నేను వెళుతున్నా!
కావాలంటే అదిగో! ఆ ఒటేలు (hotel)  కాడికి ఎళ్ళు!
కావలసినన్ని విస్తరాకులు దొరుకుతాయి.”
ఆ బిక్షాధికారి కాస్తా వెళ్ళి  పోయాడు.
“ ఊ …. ఉ…..హ్! ముష్ఠి వాడు
ఆ ఎనిమిది విస్తరాకుల్లోని మిగిలిన అన్నమంతా తినేసాడు.
పోనీ, నేను కూడా తినుంటే బాగుండేదేమో!
చి చీ! చీ! ఏమిటో పాడు ఆలోచనలు.
ఎంగిలాకులు తినే స్థాయికి దిగజీరుతోన్నది మనసు.
క్రిష్ణ క్రిష్ణా! నా మనో నిగ్రహాన్ని పరిరక్షించు పురుషోత్తమా!”
కనురెప్ప వేసేంత కాలంలో శ్రీ క్రిష్ణుడు ప్రత్యక్షమైనాడు.
“పిలిచితివా ?నారదా!” అన్నాడు.
“వచ్చావా తండ్రీ! భక్తజన మందారా!
ఆశ్రిత జన వత్సలా! తాపస, దీన జన రక్షకా!”
“నారదా! దండకం చాలు నాయనా!
దండ కేయూర భూషణాలూ, కాంచన కవచాలు …..
ఇలాంటి స్తోత్రాలకు కాస్సేపు కామా పెట్టు…..”
స్వగతంలో నారద ముని అనుకున్నాడు “కామానా? అంటే…”
నారాయణుడు కంటిన్యూ చేస్తూ ................
“…..  ఇప్పుడు చెప్పు! మునివరా!
చేయడానికి పని దొరకక
అడుక్కు తినడానికి దిగజారిన పేదవాడు అతను.
ఆతడి గురించి నీ అభిప్రాయం ఏమిటయ్యా? బొలొ,బోలో!” పృచ్ఛకునిగా మారాడు జగత్పిత.
సర్వాంతర్యామికి సకల భాషలూ తెలుసుననుకుంటూ –
ఆ ‘బాసల ’గురించి ఆశ్చర్య పడటము మానేసాడు త్రిలోక సంచారి.
“ధనవంతులు  భోగ భాగ్యాలతో తుల తూగుతూంటే
ఎంగిలి విస్తరాకుల కోసం కుక్కల కన్నా హీనంగా
బతుకుతూన్న దౌర్భాగ్యుడు పాపం! ”
తాపసి గుండె కరుణతో నిండిపోయింది.
“ఔను మరి! ఆతని గురించి జాలిపడాలే గానీ,
చీదరించుకోకూడదు, ఔను కదా!?”
“స్వానుభవం మీద తెలిసి వచ్చినది స్వామీ!
అయితే నాకీ గుణ పాఠము చెప్పకనే చెప్పడానికేనా ,
ఇంత నాటకాన్ని ఆడావు. నీ క్రిష్ణావతారము యొక్క ఆంతర్యము –
నిష్కామ కర్మ యోగమేననిన్నీ,
కర్మ సిద్ధాంత పరిపవతయే జీవన మార్గ లక్ష్యమనే నీతిని బోధపరిచినావు.
నీ లీలలు ఎవరికి ఎరుక తండ్రీ!”
“విధి విలాసము అంటే ఇదే నారదా!
సాక్షాత్తూ భగవత్ స్వరూపులకు కూడా వారి లలాట లిఖితములు
వారి నియంత్రణలో ఉండవనేది సర్వ కాల సత్య వచనము.
జీవిత మార్గానికి సురుచిర లక్ష్యాలను నిర్దేశించుకుని,
ముందుకు నడకను సాగించడమే మన అందరి కర్తవ్యము!”
శేషశయన మూర్తి అన్నాడు.
“ ఏది ఏమైనప్పటికీ నీ భక్త వాత్సల్యాన్ని సైతము
ఆస్వాదించిన భాగ్య శాలిని ఐనాను కదా,
దేవరా! ధన్యోస్మి! ధన్యోస్మి! ”
అంటూ నారద ముని తన మహతీ వీణను మీటుతూ, గానం చేయసాగాడు,
“నారద లీలా మానస డోలా…………”         
        [rachana ;-కుసుమ]
@@@@@@@@@@@@@@@@@@@@@@

     జాలి గుండె (కథా రూపకం) ;            విహంగ  (Link for story)                 Posted on 08/05/2011 by విహంగ


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...